AP Congress: ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

AP Congress: పెండింగ్‌లో 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు

Jyothi
Published on: 1 April 2024 12:57 PM IST
Candidates for AP Lok Sabha and Assembly seats finalized
X

AP Congress: ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

AP Congress: ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ఏపీలో 117 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలపై ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించారు. ఇక కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి సత్యారెడ్డి బరిలో ఉండనుండగా.. కాకినాడ నుంచి పల్లం రాజు పోటీ చేయనున్నారు. బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం బరిలో ఉండనున్నారు.

ఇక లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి దూరంగా ఉండనున్నారు. అయితే మిగతా 58 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్‌సభ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది కాంగ్రెస్ అధిష్టానం. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది కాంగ్రెస్.

Jyothi

Jyothi

Next Story