శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం

X
Highlights
శ్రీశైలంలో కల్వరి టెంపుల్ పార్సిల్ బాక్స్ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ...
Arun Chilukuri24 Sep 2020 11:11 AM GMT
శ్రీశైలంలో కల్వరి టెంపుల్ పార్సిల్ బాక్స్ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలు నుంచి క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు పార్శిల్ రావడంతో స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో దేవస్థానం ఇన్‌ఛార్జి చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీహరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కల్వరి టెంపుల్ పార్సిల్ బాక్స్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే బాక్స్‌ను ఎస్తై హరిప్రసాద్ మీడియా సమక్షంలో తెరిచారు. అందులో నిత్యావసర వస్తువులున్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Web TitleCalvary temple parcel box found in Srisailam
Next Story