Cab operators protest: ట్యాక్స్ చెల్లించలేం... వాహనాలు స్వాధీనం చేసుకోండి

Cab operators protest: ట్యాక్స్ చెల్లించలేం... వాహనాలు స్వాధీనం చేసుకోండి
x
Highlights

Cab operators protest private vehicle operators in andhra pradesh urged governament to take over their vehicles due to corona pandamic

Cab operators protest: కరోనా విలయంలో ఇబ్బందులు పడని వారు లేరనే చెప్పాలి. జమీందారులు దగ్గర్నుంచి కూలీల వరకు అంతా అన్నిరకాలుగా ఇబ్బందులు పడిన సందర్బాలున్నాయి. దీనివల్ల విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో వీటిపై ఆదారపడి జీవించే వివిద రకాల వాహనాల యాజమాన్యాలు సైతం కొట్టుమిట్టాడుతున్నాయి. దీనిలో భాగంగా విధిగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ లు చెల్లించలేమని, వీలైతే రద్దు చేయాలని కోరుతూ వారంతా నిరసనకు దిగారు.

'లాక్‌డౌన్‌తో బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఐటీ, టూరిజం సంస్థల నుంచి గిరాకీ లేదు. మార్చి 21 నుంచి బస్సులను నడపలేక, డ్రైవర్లకు వేతనాలు ఇవ్వలేక సతమతమవుతున్నాం. ఈ పరిస్థితుల్లో మొదటి త్రైమాసిక మోటార్‌ వెహికల్‌ ట్యాక్సును మాఫీ చేయండి. రెండో త్రైమాసిక పన్నును చెల్లించలేని స్థితిలో ఉన్నందున.. బస్సులను స్వాధీనం చేసుకోండి. మీ వద్దే పెట్టుకోండి'' అంటూ ప్రైవేటు బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌ల ఆపరేటర్లు సోమవారం నిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల ఎదుట బస్సులు, క్యాబ్‌లను బారులుగా నిలిపి ఆందోళన చేపట్టారు. దాదాపు 5000 వరకు ఉన్న బస్సులు, క్యాబ్‌ల్లో సుమారు 1000 వరకు వాహనాలను ఆర్టీఏ కార్యాలయాల వద్దకు తెచ్చి నిరసన తెలియజేశారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్‌ లోని రవాణా శాఖ కమిషనరేట్‌ కార్యాలయం వద్ద దాదాపు 100 వరకు బస్సులు, క్యాబ్‌లను రోడ్డు పక్కన నిలిపివేసి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర క్యాబ్‌లు, బస్సుల ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సయ్యద్‌ నిజాముద్దీన్‌, గోవిందరాజు, గోపాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా ఈ వాహనాలకు మూడు నెలలకోసారి రవాణా శాఖకు ఎంవీ ట్యాక్సును చెల్లించాలి. 50 సీట్ల బస్సుకు రూ.60 వేలు, 40 సీట్ల బస్సుకు రూ.50 వేలు, 22 సీట్ల మ్యాక్సీకి రూ.28 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్‌, మే, జూన్‌ త్రైమాసిక పన్నును చెల్లించాలి. జూలై, ఆగస్టు, సెప్టెంబరు త్రైమాసిక పన్నును అడ్వాన్సుగా జూలైలోనే చెల్లించాలి. తాము లాక్‌డౌన్‌లో వాహనాలను నడపలేదని, అయినా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక పన్నును చెల్లించాలంటూ అధికారులు వేధిస్తున్నారని నిజాముద్దీన్‌ ఆరోపించారు. అందుకే తమ వాహనాలను రవాణా అధికారులకు స్వాధీనం చేయడానికి ఆర్టీఏ కార్యాలయాల వద్దకు తెచ్చామన్నారు. కాగా.. వాహనాలను నిలిపివేసి ఆందోళనకు దిగారన్న కారణంతో నిజాముద్దీన్‌, గోవిందరాజు, గోపాల్‌రెడ్డిలతో సహా ఇతర ఆపరేటర్లను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు.

.

Show Full Article
Print Article
Next Story
More Stories