పార్టీ మార్పుపై తేల్చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

Byreddy Siddharth Reddy: వైసీపీ యువ నాయకుడు, ఏపీ శ్యాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్ధరెడ్డి టీడీపీ గూటికి చేరుతున్నారని ప్రచారం...

Arun Chilukuri
Updated on: 19 April 2022 6:30 PM IST
Byreddy Siddharth Reddy Clarify about Leaving YCP
X

పార్టీ మార్పుపై తేల్చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

Byreddy Siddharth Reddy: వైసీపీ యువ నాయకుడు, ఏపీ శ్యాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్ధరెడ్డి టీడీపీ గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవమని తేల్చిచెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ ఆదుకున్నారని, జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నమ్ముకున్న వాళ్లందరినీ గెలిపించానని చెప్పారు. నారా లోకేష్‌ను కలవాల్సిన అవసరం తనకేముందని బైరెడ్డి ప్రశ్నించారు. ఎలక్షన్స్‌కు ముందు లోకేష్‌ను కలిసిన మాట వాస్తవమేనని.. అయితే డబ్బులు ఉన్నోళ్లకే పార్టీలో లోకేశ్ అవకాశమిచ్చారని విమర్శించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story