అనకాపల్లి జిల్లా కశింకోటలో.. పడమటమ్మ తల్లి సారే ఊరేగింపు కార్యక్రమం.. హాజరైన వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు

* ఎంవీఆర్‌ను సత్కరించిన ఉత్సవ కమిటి సభ్యులు

R Tripura Malini
Published on: 30 Nov 2022 2:24 PM IST
businessman mutyala venkateswara rao performed special poojas to the goddess
X

పడమటమ్మ తల్లి సారే ఊరేగింపు కార్యక్రమం.. హాజరైన వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు

Andhra Pradesh: అనకాపల్లి జిల్లా కశింకోటలో వేంచేసి ఉన్న శ్రీ పడమటమ్మతల్లి అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు సతీష్ హాజరయ్యారు. ఎంవీఆర్‌కు మహిళలు ఘన స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనం చేసి, శాలువ కప్పి పూలమాలతో సత్కరించారు. అమ్మవారిని దర్శించుకున్న ముత్యాల వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని ఎంవీఆర్‌కు కమిటీ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో పడమటమ్మతల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story