Jagan: ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర

Jagan: బస ప్రాంతం వెంకటాచలంపల్లి నుంచి యాత్ర ప్రారంభం

Jyothi
Updated on: 8 April 2024 9:31 AM IST
Bus Yatra of  Jagan in Prakasam district
X

Jagan: ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర

Jagan: వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రకాశం జిల్లాలో 11వ రోజు కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం నుండి యాత్ర ప్రారంభంకానుంది. వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పెన్షన్‌ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండకు చేరుకొని రోడ్‌ షోలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం చేరుకుని అక్కడ సీఎం జగన్‌ రాత్రి బస చేస్తారు.

Jyothi

Jyothi

Next Story