Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ జిల్లాల పర్యటనకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు

Andhra Pradesh: రెండు బుల్లెట్ బస్సులు పరిశీలించిన ఆర్టీసీ ఎండీ

Rama Rao
Updated on: 21 April 2022 8:30 AM IST
Bullet Proof Buses for AP CM Jagan Districts Tour
X

ఏపీ సీఎం జగన్ జిల్లాల పర్యటనకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు 

Andhra Pradesh: జిల్లాల పర్యటన సందర్భంగా కార్లతో కూడిన కాన్వాయ్ వినియోగిస్తున్న ఏపీ సీఎం జగన్ ఇక నుంచి బుల్లెట్ ప్రూఫ్ బస్సులను వినియోగించనున్నారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఏపీ ఎస్ఆర్టీసీని ఆదేశించింది. ఆర్టీసీ ఎండీ రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను పరిశీలించారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సును 2009లో కొనుగోలు చేయగా.. మరో బస్సును 2015లో కొనుగోలు చేశారు.

అయితే ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులను జిల్లాల పర్యటనకు ఉపయోగించలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లాల పర్యటనలను మరింతగా పెంచే దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన భద్రతా సిబ్బంది ఇకపై బుల్లెట్ ప్రూఫ్ బస్సులోనే తిరగాలంటూ సూచించినట్టు సమాచారం. అయితే ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న బుల్టెట్ ప్రూఫ్ బ‌స్సుల‌నే జ‌గ‌న్ వినియోగిస్తారా? లేదంటే కొత్త‌గా బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సులు కొనుగోలు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Rama Rao

Rama Rao

Next Story