ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి బుగ్గన బిజీబిజీ

X
Highlights
ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు....
Arun Chilukuri13 Jan 2021 4:04 PM GMT
ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. నిన్న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన బుగ్గన ఇవాళ పలువురు కేంద్ర పెద్దలను కలిశారు. కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కలిసి మెమొరాండం అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీలో నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ధాన్యం సేకరణ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని నివర్ తుఫాన్‌తో దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఇక, ఏపీలో కొత్త ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని బుగ్గన వినతిపత్రం అందజేశారు.
Web TitleBuggana Rajendranath Delhi Tour updates
Next Story