Buddha Venkanna: క్యాసినో ఆడించి అమాయకుల నుంచి రూ. 200కోట్లు దోచుకున్నావు..

Buddha Venkanna: మంత్రి కొడాలి నానిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న.

Arun Chilukuri
Published on: 21 Jan 2022 8:36 PM IST
Buddha Venkanna Slams Kodali Nani over Casino Issue
X

Buddha Venkanna: క్యాసినో ఆడించి అమాయకుల నుంచి రూ. 200కోట్లు దోచుకున్నావు..

Buddha Venkanna: మంత్రి కొడాలి నానిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న. చంద్రబాబు రాజకీయ భిక్ష పెడితే.. ఎమ్మెల్యే అయిన కొడాలి నాని.. ఇప్పుడు జగన్‌ తానా అంటే తందానా అని నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. గుడివాడలో క్యాసినో ఆడించింది వాస్తవం కాదా..? అమాయక ప్రజల నుంచి రెండు వందల కోట్లు దోచుకున్నది నిజం కాదా అన్ని ప్రశించారు. తప్పులను ఎత్తిచూపితే టీడీపీ నేతలపై దాడులు చేయిస్తారా అని ధ్వజమెత్తారు.

కొడాలి నాని.. నీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చంద్రబాబుపై నోరు పారేసుకుంటే ఇక సహించం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశ్వరూపం చూపిస్తారు. ఇక మాకు కూడా ఓర్పు, సహనం నశించిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కాదు.. మీ ప్రభుత్వం హయాంలోనే నాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story