Buddha Venkanna: నారాయణ అరెస్ట్ వెనుక సీఎం జగన్ కుట్ర

Buddha Venkanna: మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.

Arun Chilukuri
Published on: 10 May 2022 4:06 PM IST
Buddha Venkanna Responds on Narayana Arrest
X

Buddha Venkanna: నారాయణ అరెస్ట్ వెనుక సీఎం జగన్ కుట్ర

Buddha Venkanna: మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. నారాయణ అరెస్టు వెనక సీఎం జగన్ కుట్ర ఉందని ఆరోపించారు. మొన్న ఉపాధ్యాయుల ఆందోళనలో జగన్ తీరుపై టీచర్లు ధ్వజమెత్తారని అప్పటి నుంచే జగన్ వారిపై కక్ష కట్టారన్నారు. పదోతరగతి పరీక్ష పత్రాల లీక్ వ్యవహారంలో టీచర్లపైనా, మాజీ మంత్రి నారాయణపై కేసులు పెట్టడం దారుణమన్నారు. అక్రమ అరెస్టు చేసిన నారాయణను టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ బద్ధలు కొట్టి విడిపించుకుంటామన్నారు. పదో తరగతి పేపర్‌ను ప్రభుత్వ పెద్దలే లీక్ చేశారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story