గుంటూరులో దారుణం.. ప్రేమోన్మాది ఘాతుకం

* పెళ్లికి నిరాకరించిందని దారుణానికి ఒడిగట్టిన ప్రేమికుడు

R Tripura Malini
Published on: 6 Dec 2022 7:20 AM IST
Brutal Murder Of Dental Student
X

గుంటూరులో దారుణం.. ప్రేమోన్మాది ఘాతుకం

Guntur: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందిన ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. దంత వైద్యవిద్యార్థి తపస్వి దారుణహత్యకు గురయింది. ఈ ఘటన పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విద్యార్థిని తపస్విపై ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడుతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయింది. జ్ఞానేశ్వర్ తనకు కత్తితో గాయపరచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, నిందితుడు జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణాజిల్లాకు ఉయ్యూరుకు తపస్వి, ఉంగుటూరు మండలం మణికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఈ పరిచయం ప్రేమగా చిగురించింది. పెళ్లి చేసుకోవాలని జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేయడంతో తపస్వి నిరాకరించింది. దీంతో ఉద్యోగం మానేసి జ్ఞానేశ్వర్ ఇంటి వద్దే ఉంటున్నాడు. పెద్దకాకాని సమీపంలోని తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంటికెళ్లిన తపస్విని వెంబడించిన జ్ఞానేశ్వర్‌ మరోసారి పెళ్లి విషయమై ప్రస్తావించాడు. తపస్వి నిరాకరించడంతో ముందుగానే తెచ్చుకున్న సర్జికల్ బ్లేడుతో తపస్విపై దాడికి పాల్పడ్డాడు. గొంతు భాగానికి తీవ్రమైన గాయం తగలడంతో తపస్వి మరణించింది. తపస్విని గాయపరచిన ప్రేమికుడు జ్ఞానేశ్వర్‌ తానూ ఆత్మహత్య చేసుకుంటానని గాయపరచుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వర్‌కు ప్రాణపాయం ఏమీ లేదని పోలీసులు తెలిపారు. యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం తపస్వి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story