Vijayawada: వేలాది మంది ఉద్యోగులతో నిండిపోయిన బీఆర్టీఎస్ రోడ్డు

Vijayawada: సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉద్యోగ సంఘాలు.

Jyothi
Updated on: 3 Feb 2022 2:22 PM IST
BRTS Road Filled With Thousands Of Employees
X

Vijayawada: వేలాది మంది ఉద్యోగులతో నిండిపోయిన బీఆర్టీఎస్ రోడ్డు

Vijayawada: చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా కొనసాగుతోంది. తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వెనకడుగు వేయమన్న ఉద్యోగులు చెప్పిన విధంగానే విజయవాడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విజయవాడకు వచ్చే రోడ్లపై ఎన్నో చెక్ పోస్టులు పెట్టి ఉద్యోగులను అడ్డుకున్నా, నగరానికి వస్తున్న వాహనాలను తనిఖీలు చేసినా... వేలాది మంది ఉద్యోగులు పోలీసుల కళ్లుకప్పి నగరంలోకి ప్రవేశించారు.

ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళా ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటున్నారు. మరోవైపు నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వారిని దాటుకుంటూనే ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు.


Jyothi

Jyothi

Next Story