నిను మరువలేం.. తోబుట్టువుపై ప్రేమకు నిలువెత్తు నిదర్శనం

Kakinada: రాఖీ పండుగ వేల మరణించిన అక్క విగ్రహ ఊరేగింపు అందరినీ కంట నీరు పెట్టించింది.

Arun Chilukuri
Updated on: 12 Aug 2022 5:16 PM IST
Brothers Celebrates Raksha Bandhan With Sister Statue in Kakinada
X

నిను మరువలేం.. తోబుట్టువుపై ప్రేమకు నిలువెత్తు నిదర్శనం

Kakinada: రాఖీ పండుగ వేల మరణించిన అక్క విగ్రహ ఊరేగింపు అందరినీ కంట నీరు పెట్టించింది. కాకినాడలోని పత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన బాబు రాజా సోదరి బైక్ ప్రమాదంలో మృతి చెందింది. తన అక్క మరణం జీర్ణించుకోలేని తమ్ముడు ఆమె విగ్రహం తయారు చేయించాడు. రాఖీ పండుగ సందర్భంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. తన అక్కకు జరిగినట్లు మరెవరికి జరగకూడదని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. బైక్ నడిపే ఆడపడుచులంతా జాగ్రత్తగా నడపాలని సూచించాడు. ఇంటి నుంచి బయలుదేరే ఆడపిల్లలు జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story