పుట్టిన రోజున ఆ ఇంట విషాదం.. కన్నతండ్రి ఎదుటే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పిల్లలు

Kadapa: పుట్టిన రోజు నాడే ఆ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి.

Arun Chilukuri
Published on: 22 Nov 2021 12:08 PM IST
Brother and Sister Drown in Flood Water in Kadapa
X

పుట్టిన రోజున ఆ ఇంట విషాదం.. కన్నతండ్రి ఎదుటే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పిల్లలు

Kadapa: పుట్టిన రోజు నాడే ఆ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. కన్నతండ్రి ఎదుటే నీటి ప్రవాహంలో పిల్లలు కొట్టుకుపోతున్నా నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు. ఈ ఘటన కడప జిల్లా చిన్నమండెం మండలం చాకిబండలో చోటు చేసుకుంది. పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న అక్కాతమ్ముళ్లను మృత్యువు కబళించింది. మాండవ్య నది దాటుతుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన వారు విగతజీవులుగా మిగిలారు.

చాకిబండ గ్రామానికి చెందిన అమీర్‌బాషా తన కుమార్తె పుట్టినరోజు వేడుకలు అమ్మమ్మ ఇంట్లో జరుపుకోవాలని బైక్‌పై చిత్తూరు జిల్లా కలకడకు బయలుదేరారు. దారి మధ్యలో మాండవ్య నది దాటుతుండగా ప్రమాదవశాత్తు సాజియా, జాసిర్‌‌లు నదిలో కొట్టుకుపోయారు. కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అనంతరం పోలీసు గాలింపు చర్యల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story