పెళ్లింట విషాదం.. పీటల మీదే వధువు మృతి..

Visakhapatnam: విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 12 May 2022 3:10 PM IST
Bride Collapses Before Muhurtham Time in Madhurawada
X

పెళ్లింట విషాదం.. పీటల మీదే వధువు మృతి..

Visakhapatnam: విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. ఇంతలోనే ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెకు సపర్యలు చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. వివాహ నేపథ్యంలో గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story