Teeka Mahotsav: ఏపీలో పలుచోట్ల టీకా ఉత్సవ్‌కు బ్రేక్‌

Teeka Mahotsav: అనంతపురం జిల్లాలో ప్రారంభంకాని టీకా ఉత్సవ్‌ * రాజోలు నియోజకవర్గంలో టీకా ఉత్సవానికి వ్యాక్సిన్‌ కరువు

Sandeep Eggoju
Updated on: 11 April 2021 1:55 PM IST
Break for Teeka Mahaostav of Covid Vaccination in Several Places of Andhra Pradesh
X

టీకా ఉత్సవం (ఫైల్ ఫోటో)

Teeka Mahotsav: ఏపీలో వ్యాక్సిన్ కొరత కారణంగా పలు చోట్ల టీకా ఉత్సవ్‌కు బ్రేక్ పడింది. అనంతపురం జిల్లాలో సరిపడ డోసులు అందుబాటులో లేకపోవడంతో.. టీకా ఉత్సవ్‌ ప్రారంభంకాలేదు. ముందు వచ్చిన టీకాలను పూర్తి చేయమని ఆదేశాలు రావడంతో నిన్ననే పూర్తిచేశామంటున్నారు అధికారులు. స్పెషల్ డ్రైవ్ పేరుతో నిన్న ఒక్క రోజే 23వేల డోసులు వ్యాక్సిన్ వేశామని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చిన అనంతరం టీకా ఉత్సవ్‌ నిర్వహిస్తామన్నారు జాయింట్ కలెక్టర్‌.

మరోపక్క తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో కూడా వ్యాక్సిన్ లేని కారణంగా టీకా ఉత్సవ్ ఆగిపోయింది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో టీకా ఉత్సవ్ ప్రారంభంకాలేదు. వ్యాక్సిన్ కొరతో మరేదైన కారణమోకానీ తమకు ఆదేశాలు రాలేదంటున్నారు వైద్యాధికారులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story