Brahmamgari Matam: మళ్లీ మొదటికొచ్చిన బ్రహ్మంగారి మఠం వివాదం

Brahmamgari Matam: పట్టు వీడని వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మి

Sandeep Eggoju
Published on: 26 Jun 2021 12:46 PM IST
Brahmamgari Matam Issue in Kadapa
X

బ్రహ్మంగారి మఠం (ఫైల్ ఇమేజ్)

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం వివాదం మళ్లీ మొదటికొచ్చింది. నిన్న ఎమ్మెల్యే చర్చలతో పీఠాధిపతి పోరు కొలిక్కివచ్చిందనుకునే సమయంలో.. వెంకటేశ్వరస్వాముల రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. తనకు మఠాధిపతి పీఠం ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టుకు కూర్చున్నారు.

నిన్న రెండు కుటుంబాలతో ఎమ్మెల్యే చర్చలు జరపగా.. వెంటేశ్వరస్వామి మొదటిభార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠాధిపతిగా.. మొదటిభార్య రెండో కుమారుడిని ఉత్తరాధికారిగా ఎంపిక చేశారు. వీరిద్దరి తర్వాత రెండో భార్య కుమారుడికి మఠాధిపతిగా అవకాశం ఇస్తామని చర్చ జరగగా.. అందుకు అందరూ సానుకూలంగా స్పందించినట్లు ప్రకటించారు. దీంతో ఇన్నాళ‌్ల వివాదం కొలిక్కి వచ్చిందని ఊపిరి పీల్చుకునే సమయంలో.. మహాలక్ష్మమ్మ మరో ట్విస్ట్ ఇచ్చారు. ముందునుంచి తనకు మఠాధిపతి పీఠం ఇవ్వాలంటోన్న మహాలక్ష్మి.. పట్టు వీడటం లేదు. దీంతో వెంకటేశ్వర స్వామి వారసులు మళ్లీ ఎమ్మెల్యేతో మంతనాలు మొదలుపెట్టారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story