ప్రియుడు కాదు యముడు

X
Highlights
విశాఖలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించిన అమ్మాయిలను దక్కించుకునే నేపథ్యంలో దాడులకు దిగుతున్నారు....
Arun Chilukuri2 Dec 2020 7:03 AM GMT
విశాఖలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించిన అమ్మాయిలను దక్కించుకునే నేపథ్యంలో దాడులకు దిగుతున్నారు. విశాఖ వరలక్ష్మి ఘటన మరువకముందే మరో ఉదంతం వెలుగుచూసింది. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న యువతి మెడపై కత్తితో దాడిచేశాడు శ్రీకాంత్. అనంతరం తాను మెడను కోసుకున్నాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Web Titleboyfriend attack on his girlfriend in Visakhapatnam
Next Story