Vijayawada: మురికి కాల్వలో పడి బాలుడు గల్లంతు

Vijayawada: మురికి కాల్వలో పడి బాలుడు గల్లంతు

Arun Chilukuri
Published on: 5 May 2023 3:28 PM IST
Boy Goes Missing in a Drainage in Vijayawada
X

Vijayawada: మురికి కాల్వలో పడి బాలుడు గల్లంతు

Vijayawada: విజయవాడ గురునానక్ కాలనీలో ఆరేళ్ల బాలుడు అభిరామ్ ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు డ్రయిన్ లో పడి గల్లంతైన ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం విజయవాడలో గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ప్రవాహానికి బాలుడు కొట్టుకుపోయాడు. దీంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం డ్రెయిన్ స్లాబ్స్ ను తవ్వుతున్నారు అధికారులు. బాలుడు పడిపోయిన స్పాట్ నుంచి 500 మీటర్ల దూరంలో డ్రయిన్ ను బ్రేక్ చేస్తున్నారు. డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బాలుడు కొట్టుకుపోయి.. ఎక్కడైనా స్టక్ అయి ఉంటాడని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story