నాటుబాంబు పేలుడు ఘటనలో గాయపడిన బాలుడు మృతి

X
Highlights
కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో నిన్న జరిగిన బాంబు పేలుడు ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో ...
Arun Chilukuri16 Nov 2020 9:07 AM GMT
కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో నిన్న జరిగిన బాంబు పేలుడు ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 12 ఏళ్ల వరకుమార్ కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. బాంబులు ఎవరు తెచ్చారు... ఎక్కడి నుంచి తీసుకువచ్చారన్న కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. మరిన్ని బాంబులు దాచి ఉంటారన్న కోణంలో చెన్నంపల్లెలో అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
నాటుబాంబుల వ్యవహారం గ్రామంలో కలకలం రేపింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు ఇక లేడంటూ గుండెలు బాదుకుంటున్నారు. తమ పిల్లాడి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Web Titleboy dies injured in a country-made bomb blast in Kurnool
Next Story