విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2024 5:19 PM IST
Botsa Satyanarayana Wins Vizag Local Bodies MlC Bypoll
X

విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో బొత్స సత్యనారాయణ మాత్రమే ఉండటంతో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి. బొత్సను ఎమ్మెల్సీగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రం అందజేశారు. బొత్సతో పాటు స్వతంత్ర్య అభ్యర్థి షఫీ ఉల్లా నామినేషన్ వేయగా ఈనెల 14న ఆయన నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. దాంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. తన ఎన్నికకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story