Botsa Satyanarayana: సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై టీడీపీది అనవసర రాద్ధాంతం- బొత్స

Botsa Satyanarayana: సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు మంత్రి బొత్స.

Arun Chilukuri
Published on: 10 Jun 2021 4:03 PM IST
Botsa Satyanarayana Slams TDP False Campaign Against YS Jagan Delhi Tour
X

Botsa Satyanarayana: సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై టీడీపీది అనవసర రాద్ధాంతం- బొత్స

Botsa Satyanarayana: సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు మంత్రి బొత్స. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకే జగన్‌ ఢిల్లీకి వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్‌ దొరికితే ఒకలా.. దొరక్కపోతే మరోలా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు మంత్రి బొత్స.

కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ కాసేపటిక్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. జగన్‌ వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉ‍న్నారు. హోంమంత్రి అమిత్‌ షా, జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్‌ కలుసుకుంటారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story