ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి బయటపడింది : మంత్రి బొత్స

ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి బయటపడింది : మంత్రి బొత్స
x
ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి బయటపడింది : మంత్రి బొత్స
Highlights

ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి వ్యవహారం బయటపడిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మిగతా లెక్కలు చూసుకోవడానికి చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ కు...

ఐటీ దాడులతో చంద్రబాబు అవినీతి వ్యవహారం బయటపడిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మిగతా లెక్కలు చూసుకోవడానికి చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ కు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఇళ్లపై కూడా ఐటీ దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరిగాయని ఐటీ శాఖ ప్రకటించిందని బొత్స అన్నారు.

కాంట్రాక్టుల పేరుతో రాష్ట్రంలో రూ. వేల కోట్ల అవినీతికి టీడీపీ పాల్పడిందని బొత్స అన్నారు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి అని, అవినీతి కాదని బొత్స వ్యాఖ్యానించారు. ఐటీ దాడులపై చంద్రబాబు, లోకేష్ లు నోరు మెదపడంలేదన్నారు. ప్రణాళికసంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు అవినీతి ప్లాన్ లు వేశారని చెప్పారు. రివర్స్ టెండరింగ్ తో వైసీపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు మిగిల్చిందని బొత్స గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories