Botsa Satyanarayana: కుప్పం ఫలితంతోనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి

Botsa Satyanarayana: ఏపీలో జరిగిన నగర పాలక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు 98 శాతం మార్కులేసారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Arun Chilukuri
Published on: 17 Nov 2021 6:00 PM IST
Botsa Satyanarayana Slams Chandrababu After Municipal Elections Grand Victory
X

Botsa Satyanarayana: కుప్పం ఫలితంతోనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి

Botsa Satyanarayana: ఏపీలో జరిగిన నగర పాలక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు 98 శాతం మార్కులేసారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ చేసిన సంక్షేమం గుర్తుంచుకుని మొత్తం 101 యూఎల్బీలకు ఎన్నికలు జరగగా దాదాపు అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ వచ్చిన ఫలితాలు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సమానంగా ఓట్లు వచ్చాయని తెలిపారు.

ప్రభుత్వం, నాయకులు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు బురదచల్లినా ప్రజలు విశ్వసించలేదన్నారు. కుప్పం ఫలితంతో అయినా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఇక చంద్రబాబు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు ఈవీఎంలను నిందించారని, నిన్న దొంగ ఓట్లు అంటున్నాడడని, ఆ భగవంతుడే చంద్రబాబును రక్షించాలని చురకలంటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story