Guntur: జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించిన బొత్స

Guntur: గుంటూరు జిల్లా యడ్లపాడు జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను మంత్రి బొత్స సందర్శించారు.

Arun Chilukuri
Published on: 17 Jun 2021 4:02 PM IST
Botsa Satyanarayana inspects Jindal Plant in Guntur
X

Guntur: జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించిన బొత్స

Guntur: గుంటూరు జిల్లా యడ్లపాడు జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను మంత్రి బొత్స సందర్శించారు. జిందాల్ నిర్మిస్తున్న ప్లాంట్ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాంట్ నిర్మాణం 2016లోనే ప్రారంభమైనా పనులు ఆలశ్యమయ్యాయన్న మంత్రి.. ప్లాంట్‌కు అవసరమైన నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చేనెలలో ప్లాంట్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దీంతో పాటు గుంటూరులో వెనుకబడ్డ భూగర్భ డ్రైనేజీ పనులు కూడా పూర్తిచేస్తామని మంత్రి బొత్స తెలిపారు. కాగా, ఈ జిందాల్‌ ప్లాంట్‌ వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story