Botsa Satyanarayana: లాభాపేక్షతోనే అమర్ రాజా తరలిపోతోంది

Botsa Satyanarayana: అమర్ రాజా పరిశ్రమ లాభాపేక్షతోనే రాష్ట్రం దాటి వెళుతోందన్నారు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ.

Arun Chilukuri
Published on: 3 Aug 2021 8:30 PM IST
Botsa Satyanarayana Fires On Opposition Fake Propaganda on House Tax Allegations
X

Botsa Satyanarayana: లాభాపేక్షతోనే అమర్ రాజా తరలిపోతోంది

Botsa Satyanarayana: అమర్ రాజా పరిశ్రమ లాభాపేక్షతోనే రాష్ట్రం దాటి వెళుతోందన్నారు మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ కంపెనీ వల్ల కాలుష్యం ఎక్కువ మొత్తంలో విడుదల అవుతోందని అందుకే నోటీసులిచ్చామనీ అన్నారు. అమర్‌ రాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. వాళ్లు వెళ్లిపోవాలని మేము కోరుకోవడం లేదన్నారు. ఆస్తి పన్ను, చెత్త పన్నుపై విపక్షాలు చేస్తున్నది రాద్ధాంతమేనన్నారు బొత్స.

తెలంగాణతో గొడవలు పడాలని తామేనాడు అనుకోలేదని, కోరుకోటం లేదని అన్నారు. సామరస్య పూర్వకంగా వివాదం సర్దుబాటు కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇక చట్టం చేసిన నాడే మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయని అన్నారు. ఇక రాజధానుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story