టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్

X
Botsa Satyanarayana (file image)
Highlights
చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రతీ విషయాన్ని రాజకీయం చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Arun Chilukuri11 Nov 2020 1:49 PM GMT
చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రతీ విషయాన్ని రాజకీయం చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బాబు నీచ రాజకీయాలు ప్రజలు చూస్తున్నారని హెచ్చరించారు. పేద ప్రజలకు ఉచితంగా ఇండ్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందని ఆరోపించారు.
ఇక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితుల తరుపున కోర్టులో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు వాదించారని తెలిపారు. నిందితులకు బెయిల్ ఇప్పించింది చంద్రబాబు కాదా అని బొత్స ప్రశ్నించారు.
Web TitleBotsa Satyanarayana Comments on TDP party
Next Story