దానంతట అదే పొంగిపొర్లుతోన్న బోరుబావి..!

* భూగర్భజలాలు పెరిగి నీరు ఉబికి వస్తోన్న వైనం.. మోటారు బిగించి పంట వేస్తానంటున్న అన్నదాత

R Tripura Malini
Published on: 13 Nov 2022 11:51 AM IST
Borewell Overflowing In Sri Satya Sai District
X

దానంతట అదే పొంగిపొర్లుతోన్న బోరుబావి

Borewell Overflow: శ్రీ సత్యసాయి జిల్లా ఓ డీ చెరువు మండలం గాజుకుంటపల్లిలో ఓ బోరు బావిలో పాతాళగంగ ఉబికి వస్తోంది. మోటారు లేకుండానే పొంగిపొర్లుతోంది. గ్రామానికి చెందిన షానవాజ్ ఖాన్ రెండున్నరేళ్ల క్రితం 600 అడుగుల లోతు బోరుబావి తవ్వించాడు. బోరు వేసినప్పడు కొద్దిగా నీరు రావడంతో ఉన్న కొద్దిపాటి నీటితోనే పంటలు వేయాలని మోటారు బిగించాడు. కానీ కొన్నిరోజుల తర్వాత బోరులో నీరు ఎండిపోవడంతో మోటారు తీసేసి అమ్మేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భజలాలు పెరగడంతో బోరుబావిలో నీరు ఉబికి వస్తున్నాయి. వెయ్యి అడుగుల లోతు తవ్వినా చుక్క నీరు పడని ఈ కరువు ప్రాంతంలో బోరు బావిలో వాటంతటవే నీరు ఉబికి వస్తుండడంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మోటారు బిగించి పంటలు వేస్తానని రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

R Tripura Malini

R Tripura Malini

Next Story