Kurnool: కాసులకు కక్కుర్తి పడుతూ పెట్రోల్ కల్తీ

* పెట్రోల్‌కు బదులు నీళ్లు * కర్నూలు జిల్లా నంద్యాలలోని బొమ్మలసత్రం పెట్రోల్ బంక్‌లో ఘటన

Shilpa
Published on: 1 Nov 2021 2:08 PM IST
Bommalasatram Nandyal Petrol Bunk Dispenses Water Instead of Petrol
X

కాసులకు కక్కుర్తి పడుతూ పెట్రోల్ కల్తీ(ఫైల్ ఫోటో)

Kurnool: ఓ వైపు పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పెట్రోల్ బంకుల్లో కాసులకు కక్కుర్తిపడుతూ పెట్రోల్‌ను కల్తీ చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలోని బొమ్మలసత్రం పెట్రోల్ బంక్ వద్ద ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులు నీళ్లు వచ్చాయి. అయితే ఇది గమనించిన వాహనదారులు పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

Shilpa

Shilpa

Next Story