Bhimavaram: సీఎం జగన్‌ పర్యటనకు ముందు బాంబు పేలుడు

Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లాలో బాంబు కలకలం రేగింది.

Arun Chilukuri
Published on: 13 Aug 2021 7:56 PM IST
Bomb Explosion at Bhimavaram Undi Road
X

Bhimavaram: సీఎం జగన్‌ పర్యటనకు ముందు బాంబు పేలుడు

Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లాలో బాంబు కలకలం రేగింది. భీమవరం-ఉండి రోడ్లోని ఓ ఖాళీ స్థలంలో బాంబు పేలింది. ఆవు గడ్డి మేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆవుకు తీవ్రగాయాలు కాగా పేలుడు ధాటికి ఘటనాస్థలంలో భారీ గుంత ఏర్పడింది. రేపు సీఎం జగన్‌ భీమవరంలో పర్యటించనున్నారు. ఆ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే పేలుడు జరగడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story