చోరీ చేసాడు... ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడే మకాం పెట్టాడు..!

Bobbili Theft Case: మీకు వెంకటేశ్ నటించిన రాజా సినిమా గుర్తుందా? దొంగతనం చేసేందుకు వెంకటేశ్, సుధాకర్‌‌లు సౌందర్య ఇంటికి వస్తారు.

Indira Ram
Published on: 2 July 2025 1:59 PM IST
Bobbili Thief Stays in House for 4 Days Robbery News
X

చోరీ చేసాడు... ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడే మకాం పెట్టాడు..!

Bobbili Theft Case: మీకు వెంకటేశ్ నటించిన రాజా సినిమా గుర్తుందా? దొంగతనం చేసేందుకు వెంకటేశ్, సుధాకర్‌‌లు సౌందర్య ఇంటికి వస్తారు. అయితే అక్కడ వాళ్లని లాక్ చేసి, ఒక నాలుగు రోజుల పాటు అక్కడే సౌందర్య ఉంచుతుంది. వారితో వంటలు చేయిస్తుంది. ఇక్కడ వెంకటేశ్ , సుధాకర్‌‌లు చోరీకని వచ్చి ఇరుక్కుపోతే.. ఇప్పుడు మీరు చూసే కేసులో మాత్రం చోరీకని వచ్చి అక్కడే ఆ దొంగ మకాం పెట్టేసాడు. ఈ వింత చోరీ సంఘటన బొబ్బిలిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఎక్కడైనా ఎవరైనా దొంగతనానికి వస్తే కావాల్సిన వస్తువులు, కనిపించిన వస్తువులు దొంగతనం అక్కడ నుంచి తుర్రుమని పారిపోతారు. కానీ ఈ వింత దొంగ ఏం చేసాడంటే.. దొంగతనం చేయడానికి ఒక ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి కొన్ని సామాన్లు పట్టుకెళ్లి మళ్లీ రాత్రి వచ్చి ఇక్కడే పడుకున్నాడు. మళ్లీ పొద్దున లేచి వెళ్లాడు. అలా నాలుగు రోజుల పాటు ఏదో ఒక హోటల్‌ గదికి వచ్చినట్లు ఈ ఇంటికి వచ్చి మకాం వేసాడు.

ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి అంబేద్కర్ కాలనీలో జరిగింది. అలజంగి గ్రామానికి చెంది శీర శ్రీనివాసరావు, జయలక్ష్మి దంపతులకు గొల్లపల్లిలో ఇల్లు ఉంది. వీరిద్దరి పొలం పనుల నిమిత్తం తమ గ్రామానికి వెళ్లి ఉంటున్నారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటం చూసిన దొంగ ఇదే సరైన సమయం అనుకుని ఆ ఇంటిలోకి వెళ్లాడు. ఇంకేముందు.. లోపలకి వెళ్లిన వెంటనే ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించాడు. కనిపించిన సామానులను సర్దు కున్నాడు. బయటకు వెళ్లిపోయి వాటిని అమ్మేసుకున్నాడు. సామాన్లు అమ్మితే వచ్చిన డబ్బులతో ఫుల్‌గా తాగేసాడు. తిరిగి అదే ఇంటికి వచ్చి పడుకున్నాడు. మళ్లీ ఆ తర్వాత రోజు ఉదయాన్నే లేచి మరికొన్ని సమానులను తీసుకుని బయటకు వెళ్లి, వాటినీ అమ్మేశాడు. మళ్లీ తాగేసి అదే ఇంటికి వచ్చాడు. ఇలా ఈ దొంగ తిరగడాన్ని చుట్టుపక్కలున్నవారు గమనించారు.. శీరా శ్రీనివారసరావుకి సమాచారాన్ని అందించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేస్తే.. విచారణ చేసారు.

ఈ దొంగతనం కేసులో దొంగ మద్యం సేవించాడు. అదేవిధంగా శ్రీనివాసరావు ఇంట్లో కొన్ని విలువైన సామాన్యులు కనిపించడం లేదు. దొంగను అడిగితే అమ్మేసాననే సమాధానం ఇచ్చాడు. నాలుగు రోజుల పాటు ఆ ఇంట్లో ఉండటం ఒక విచిత్రం అంటే మరొక విచిత్రం ఏంటంటే.. దొంగతనం చేసిన ఇంట్లో ఉన్న బీరువాలో 10వేల రూపాయలు ఉన్నాయి. కానీ దొంగ వాటిని ముట్టక పోవడం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగ ఎవరు? ఎంత వరకు దొంగతనం చేశాడు..అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Indira Ram

Indira Ram

Next Story