బోటు వెలికితీతకు మరో ప్రయత్నం..రెండు పద్దతులతో ముందుకు సాగాలని..

బోటు వెలికితీతకు మరో ప్రయత్నం..రెండు పద్దతులతో ముందుకు సాగాలని..
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి...

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన పర్యాటక బోటు రాయల్ వశిష్టను బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నేటి నుంచి గోదావరిలో బోటు వెలికతీత పనులు మొదలుపెట్టబోతోంది. బోటు మునిగిపోయి నేటికి 29 రోజులు అయ్యింది. బోటు మునిగిపోయిన ఘటనలో గల్లంతైన పర్యాటకుల్లో 13 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది.

కచ్చులూరు దగ్గర వరద ప్రవాహం తగ్గడంతో పాటు వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో వెలికితీత పనులు ప్రారంభించాలని ధర్మాడి సత్యం బృందం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి నుంచి అనుమతి రావడంతో ధర్మాడి సత్యం తన బృందాన్ని తీసుకుని యంత్ర సామగ్రితో కచ్చులూరు బయల్దేరి వెళ్లారు. వాతావరణ పరిస్థితులు అంతా అనుకూలంగా కనిపించడంతో ఎక్కువ రోజులు ఆలస్యం చేయకుండా ఆపరేషన్‌ ప్రారంభించాలని నిర్ణయించారు.

గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం టీమ్‌ గతంలో విశ్వ ప్రయత్నాలు చేసింది. మూడు రోజుల పాటు రకరకాల ప్లాన్‌లతో ప్రయత్నించి విఫలమైంది. ఈసారి ఎలాగైనా సక్సెస్‌ కావాలని పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతుంది. రెండు పద్దతులతో ముందుకు సాగాలని నిర్ణయించింది. మొదటి పద్దతిలో ప్రమాద ప్రదేశంలో 200 మీటర్ల పరిధి వరకూ రోప్‌ను వృత్తాకారంలో వేసి రెండు చివరి కొనలను పొక్లెయిన్‌కు అనుసంధానం చేసి లాగడం ఇక రెండో పద్దతిలో బోటు మునిగిన ప్రాంతంతో పాటు 200 మీటర్ల పరిధిలో కూడా లంగరు వేసి దానిని పొక్లెయిన్‌కు అనుసంధానం చేసి లాగాలని గట్టి ప్రయత్నం చేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories