బోటు దొరికినా కనపడని రమ్య జాడ

బోటు దొరికినా కనపడని రమ్య జాడ
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన పర్యాటక బోటును గోదావరి నుంచి బయటికి తీయడంతో బాధితుల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. తమవారిని కనీసం చివరి చూపు...

తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన పర్యాటక బోటును గోదావరి నుంచి బయటికి తీయడంతో బాధితుల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. తమవారిని కనీసం చివరి చూపు అయినా చూసుకోవచ్చని ఆశపడ్డారు. అయితే, వెలికితీసిన బోటులో ఎనిమిది మృతదేహాలు దొరికినా అవన్నీ కుళ్లిపోయి చిద్రమై ఉండటంతో గుర్తించడం కష్టతరంగా మారింది. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే, వాళ్లు ధరించిన బట్టలు, జేబుల్లో ఉన్న గుర్తింపు కార్డులు ఆధారంగా ఎనిమిది మృతదేహాల్లో ఐదుగురిని గుర్తించారు. ఇంకా మూడు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.

మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో మిగిలిన మూడు మృతదేహాల్లో రమ్యశ్రీ డెడ్‌బాడీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మృతదేహాలన్నీ మట్టితో నిండిపోయి ఉండటం అలాగే కొన్ని డెడ్ బాడీస్ కు కాళ్లూచేతులు, అవయవాలు తెగిపోయి ఉండటంతో గుర్తించడం కష్టంగా మారిందంటున్నారు. అయితే, మృతదేహాలను గుర్తించలేకపోతే డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ తరలించనున్నట్లు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అంటున్నారు.

ఇక, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడంపై రమ్య తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మంచిర్యాల నుంచి వచ్చిన రమ్య తల్లిదండ్రులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, బోటు నుంచి బయటికి తీసిన మృతదేహాలన్నీ బురదమయంగా ఉన్నాయని, దాంతో గుర్తుపట్టలేకపోతున్నామని రమ్య తండ్రి అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories