Pulicat Lake: ఆగిపోయిన నాటు పడవ.. 2 గంటల పాటు సరస్సు మధ్యలోనే 60 మంది విద్యార్థులు

Boat Barked in Pulicat Lake Tirupati
x

Pulicat Lake: ఆగిపోయిన నాటు పడవ.. 2 గంటల పాటు సరస్సు మధ్యలోనే 60 మంది విద్యార్థులు 

Highlights

Pulicat Lake: పులికాట్ సరస్సులో నాటు పడవ ఆగిపోవడంతో ఏకంగా 60 మంది విద్యార్థులు చిక్కుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

Pulicat Lake: పులికాట్ సరస్సులో నాటు పడవ ఆగిపోవడంతో ఏకంగా 60 మంది విద్యార్థులు చిక్కుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తిరుపతి జిల్లా తడ మండలంలోని పులికాట్ సరస్సులో ఓ నాటు పడవ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇరకం దీవి నుంచి తమిళనాడు లోని సున్నపుగుంటకు నాటు పడవలో దాదాపు 60 మంది విద్యార్థులు బయల్దేరారు. అయితే సాయంత్రం తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా మార్గమధ్యంలో పడవ నిలిచిపోవడంతో స్టూడెంట్స్‌ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

నిన్న సాయంత్రం స్కూలు నుంచి తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో నాటు పడవ ఆగిపోవడం ఆ ప్రాంతంలో మొబైల్‌ సిగ్నల్ లేకపోవడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే స్థానికులు వేరే నాటు పడవల్లో ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపు 2 గంటల పాటు విద్యార్థులంతా సరస్సు మధ్యలోనే ఉండిపోయారు. జాలర్లు వేసిన వలలు పడవకు చిక్కుకుపోవడం వల్లే పడవ కదలకుండా మొరాయించినట్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories