గోదావరి బోటు వెలికితీత.. ఇంకా 50 అడుగులే!

గోదావరి బోటు వెలికితీత.. ఇంకా 50 అడుగులే!
x
Highlights

లంగరుతోపాటు రాయల్ వశిష్ట బోటు రెయిలింగ్ రావడంతో ఆశలు చిగురించాయి. ఒడ్డు నుంచి కేవలం 200 మీటర్ల దూరంలోనే బోటు ఉంది. రెండు రోజుల్లో బోటును బయటకు...

లంగరుతోపాటు రాయల్ వశిష్ట బోటు రెయిలింగ్ రావడంతో ఆశలు చిగురించాయి. ఒడ్డు నుంచి కేవలం 200 మీటర్ల దూరంలోనే బోటు ఉంది. రెండు రోజుల్లో బోటును బయటకు తీస్తామని ధర్మాడి సత్యం ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం నాలుగు రోజులుగా బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గోదావరిలో బోటును బయటకు తీసే క్రమంలో రెండో రోజు లంగరుకు బలమైన వస్తువుకు తగిలింది. వెంటనే సత్యం బృందం ఇనుప రోప్‌ను బయటకు లాగే పనులు చేపట్టింది.

మూడో రోజు రోప్ బయటకు లాగుతుండగా లంగరుకు రాయల్ వశిష్ట బోటు రెయిలింగ్ రావడంతో ఆశలు చిగురించాయి. గోదావరిలో కేవలం 50 అడుగుల లోతులోనే బోటు ఉన్నట్లు ధర్మాడి సత్యం చెబుతున్నారు. ఒడ్డు నుంచి కేవలం 200 మీటర్ల దూరంలోపే బోటు ఉందన్నారు. అయితే, విశాఖపట్నం నుంచి కొందరు డైవర్లు వస్తారని తెలిపారు. రెండు రోజుల్లో బోటు బయటకు తీస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

లంగరు రెయిలింగ్‌ను పట్టుకుందని, అందుకే రెయిలింగ్ ఊడి వచ్చినట్లు బృంద సభ్యులు చెబుతున్నారు. బోటు దాదాపు 25 టన్నులకు పైగా బరువు ఉంటుందని, రెయిలింగ్ అంత బరువును లాగలేదని తెలిపారు. బోటుకు ఉన్న ఐరన్ కమ్మెలు లేదా కింద వైపు ఫ్యాన్ సమీపంలో ఉండే ఇనుప రాడ్లకు లంగర్ తగిలితే తప్పకుండా బోటు బయటకు వస్తుందని చెబుతున్నారు.

అయితే రెండు రోజుల కిందట బోటు వెలకితీత పనులను కాకినాడ పోర్టు అధికారులకు అప్పగించడంతో కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం కూడా సహకరిస్తోంది. గత నెల కచ్చులూరు వద్ద బోటు మునిగి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మృతి చెందారు. గల్లంతైన వారిలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం కాగా మరో 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories