Boat Accident at Rajahmandry: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఘోర ప్రమాదం

Boat Accident at Rajahmandry: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

S. Srikanth
Published on: 20 Aug 2020 9:38 PM IST
Boat Accident at Rajahmandry: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఘోర ప్రమాదం
X

Boat Accident at Rajahmandry: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు లోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ‌ మునిగిపోయింది. ఘటనలో ముగ్గురు గల్లంతు అయ్యారని సమాచారం.. చీకటి పడటంతో ఎంత మంది లాంచీలో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు చింతూరు మండలం వరద ముంపు గ్రామం కల్లేరు లాంచిలో వెళ్ళిన రెవిన్యూ అధికారులు.

.అంతకు ముందే వరద భాదితులకు నిత్యావసరాలు పంపిణీ చేసి వెనక్కి వచ్చిన లాంచీ ఐటిడిఎ పివో వెంకటరమణ తో సహా చింతూరులో తిరిగి లాంచీ దిగిన రెవిన్యూ సిబ్బంది. ఆ తర్వాత లాంచీ వెనక్కి తీసుకువెళ్ళి లంగరు బ్రిడ్జి సమీపంలో వేసుకోవడానీకి మళ్ళింపు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చీకటి పడటంతో నేరుగా బ్రిడ్జిని ఢీకొట్టడంతో ముక్కలైన లాంచీ..లాంచీ దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురులో ఇద్దరు సురక్షితం

క్షేమంగా బయటపడ్డారు. కచ్చులూరు వద్ద లాంచీ జలసమాధి ఘటన జరిగి ఏడాది గడవక ముందే గోదావరి వరద ఉధృతి లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. తృటిలో భారీ ప్రమాదం తప్పింది అంతకు ముందే లాంచీలో రెవిన్యూ టీం లాంచి దిగారు. వంతెన వద్ద లాంచీ దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురులో ఇద్దరు సురక్షితం క్షేమంగా బయటపడిన రాంబాబు, సత్తిబాబు. సరంగు పెంటయ్య అనే వ్యక్తి ఆచూకి లభించలేదు.

S. Srikanth

S. Srikanth

Next Story