Andhra Pradesh: చిన్నాయగూడెం గ్రామంలో చేత బడి కలకలం

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో చేత బడి కలకలం రేగింది.

Kranthi
Updated on: 3 March 2021 11:04 AM IST
Blackmagic Creates Fear Chinnayagudem Village
X

ఫైల్ Image

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో చేత బడి కలకలం రేగింది. గ్రామ పొలిమేరలో గల గంగానమ్మ గుడి వద్ద, గ్రామ వీధుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు ఎరుపు రంగు నీరు, పసుపు చల్లుతున్నారు. వీరు చేతబడి చేస్తున్నారు అని గ్రామస్తులు భయపడి ఆ ఇద్దరిని గ్రామస్తులు నిర్బంధించారు. గంగానమ్మ తల్లి ఆగ్రహించింది అని కొందరు గ్రామస్తులు చెప్పగా, గంగానమ్మ గుడి వద్ద గ్రామస్తులు శాంతి పూజలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ..ఆ మహిళను, పురుషుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

Kranthi

Kranthi

Next Story