AP News: ఎన్టీఆర్ జిల్లా చౌటపల్లిలో క్షుద్రపూజల కలకలం

AP News: గుప్తనిధుల కోసం వచ్చిన వ్యక్తుల వెంట చిన్న బాలుడు

Dhatripriya
Published on: 13 Feb 2023 9:37 AM IST
Black Magic In Chowtapalli NTR District
X

AP News: ఎన్టీఆర్ జిల్లా చౌటపల్లిలో క్షుద్రపూజల కలకలం

AP News: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లిలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. టేకులపల్లి- చౌటపల్లి గ్రామాల మధ్య లంకెబిందెలు ఉన్నాయని క్షుద్రపూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గుప్తనిధుల కోసం వచ్చిన వ్యక్తుల వెంట చిన్న బాలుడు ఉన్నాడు. దీంతో నరబలి ఇవ్వడానికే బాలుడిని తెచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గుప్తనిధుల కోసం వచ్చిన 8 మందిలో నలుగురు పరారయ్యారు. నలుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. వీరంతా బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులుగా గుర్తించారు.

Dhatripriya

Dhatripriya

Next Story