Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ను ఆర్యోగ్య శ్రీలో చేర్చుతాం- సీఎం జగన్‌

Black Fungus Treatment Under Aarogyasri Says CM Jagan
x

Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ను ఆర్యోగ్య శ్రీలో చేర్చుతాం- సీఎం జగన్‌

Highlights

Black Fungus: కోవిడ్‌-19 కట్టడిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Black Fungus: కోవిడ్‌-19 కట్టడిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన వైసీపీ సర్కార్‌ బ్లాక్‌ ఫంగస్‌ను కూడా చేర్చుతున్నట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది.

కరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్న వేళ ఏపీ సర్కార్‌ ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించి పదిరోజులే అయిందన్న సీఎం జగన్‌ కర్ఫ్యూ నాలుగు వారాలు ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయని వెల్లడించారు. రూరల్‌ ఏరియాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక కోవిడ్‌తో అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చుతామన్నారు సీఎం జగన్.

ఇప్పటివరకు రాష్ట్రంలో తొమ్మిది బ్లాక్‌ ఫంగస్‌ కేసులు గుర్తించామన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని. బ్లాక్‌ ఫంగస్‌ నివారణ మందులు సమకూర్చుతున్నామన్న ఆయన 10వేల ఆక్సిజన్‌ కాన్స్‌న్‌ట్రేటర్లకు టెండర్లు పిలిచామని వివరించారు. ఇక ఈనెలాఖరుకు 2వేలకుపైగా ఆక్సిజన్‌ కాన్స్‌న్‌ట్రేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు మంత్రి. ఫీవర్‌ సర్వేలో భాగంగా కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి, లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 625 కోవిడ్‌కేర్ ఆసుపత్రుల్లో 47వేల 825 బెడ్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అందులో 38వేల 492బెడ్లు కోవిడ్‌ రోగులతో నిండాయన్న అధికారులు వారిలో 25వేల 539 మంది ఆరోగ్య శ్రీ కింద కరోనా చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక కోవిడ్‌ హాస్పిటల్స్‌లో 6వేల 576 ఐసీయూ బెడ్లు, 23వేల 463 నాన్‌ ఐసీయూ బెడ్లు ఉండగా 17,246 నాన్‌ ఆక్సీజన్‌ బెడ్లు, 3వేల 467 వెంటిలేటర్ల బెడ్లు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories