Chittoor: రికార్డు స్థాయిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

Chittoor: ఏపీలో ఓ పక్క కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది.

Arun Chilukuri
Published on: 25 May 2021 10:44 AM IST
Black Fungus Cases Rise in Chittoor District
X

బ్లాక్‌ ఫంగస్‌(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Chittoor: ఏపీలో ఓ పక్క కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. మరోపక్క బ్లాక్‌ ఫంగస్‌ కలవర పెడుతోంది. చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 15 బ్లాక్ ఫంగస్‌ కేసులను గుర్తించారు వైద్యులు. తిరుపతి రుయాలో 9, స్విమ్స్‌ ఆస్పత్రిలో 6 కేసులు నిర్ధారణ కాగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 33 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి ఇప్పటివరకు జిల్లాలో ఇద్దరు మృతి చెందగా తిరుపతి రుయాలో 21 మంది, స్విమ్స్‌ ఆస్పత్రిలో 12 మంది చికిత్స పొందుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story