ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు

ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు
x
Highlights

ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. రాష్ట్ర పార్టీ నూతన అధ్యక్షుడిగా సోమూవీర్రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు...

ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. రాష్ట్ర పార్టీ నూతన అధ్యక్షుడిగా సోమూవీర్రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నేతలు ఎండగడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. విజయవాడలో పార్టీ రాష్ర్ట కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకలాపాలు ముమ్మరం చేశారు.

ఏపీలో బీజేపీ వేగం పెంచింది. కేంద్రంలో రెండోసారి అధికారంలో వచ్చిన నాటి నుంచి ఏపీపై మరింత ఫోకస్ చేసింది. 2024 లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఓ వైపు ప్రభుత్వంపై పోరాడుతూనే మరో వైపు పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్న బీజేపీ తాజగా విజయవాడలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

ఇప్పటికే రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయిన సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త కమిటీతో రాష్ర్ట కార్యవర్గాన్ని విస్తరించారు. విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడుతున్నారు. రాబోయే రెండేళ్లలో పార్టీ శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు చెబుతున్నారు.

అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ అందుకు కావాల్సిన అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం వైఫల్యాలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీ 2024లో ప్రాంతీయ పార్టీలను దాటుకుని అధికారంలోకి రగలదా అనే వారు లేకపోలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories