ఏపీలో రామతీర్థ ఘటనపై కొనసాగుతున్న లొల్లి

X
Highlights
ఏపీలో రామతీర్థ ఘటన లొల్లి ఇప్పట్లో తగ్గేటట్టులేదు. రామతీర్థ ఘటనకు బీజేపీ నేతలు కారకులని డీజీపీ వ్యాఖ్యలు...
Arun Chilukuri21 Jan 2021 10:28 AM GMT
ఏపీలో రామతీర్థ ఘటన లొల్లి ఇప్పట్లో తగ్గేటట్టులేదు. రామతీర్థ ఘటనకు బీజేపీ నేతలు కారకులని డీజీపీ వ్యాఖ్యలు చేయడంతో మ్యాటర్ కాస్త ఇంకా సీరియస్ అయ్యింది. దీంతో డీజీపీ వ్యాఖ్యలపై కమళనాథులు గుర్రుగా ఉన్నారు. డీజీపీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ డీజీపీ కార్యలయ ముట్టడికి బయల్దేరారు బీజేపీ నేతలు. దీంతో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ VS డీజీపీగా మారింది.
Web TitleBJP vs DGP in AP over Ramateertham Temple Issue
Next Story