బాబుకు ఝలక్.. బీజేపీ బంపర్ ప్లాన్..

బాబుకు ఝలక్.. బీజేపీ బంపర్ ప్లాన్..
x

బాబుకు ఝలక్.. బీజేపీ బంపర్ ప్లాన్..

Highlights

TDP: ఏపీలో పొత్తు లెక్కలు తేలే ముందు తెర వెనుక చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.

TDP: ఏపీలో పొత్తు లెక్కలు తేలే ముందు తెర వెనుక చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. టీడీపీతో వెళ్లాల్సిందేనని జనసేనాని భావిస్తుంటే టీడీపీతో కలిసేదేలేదని బీజేపీ నేతలు కుండబద్ధలుకొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా జనసేనాని పావులు కదుపుతుంటే పాత పగను మర్చిపోలేమంటోంది ఏపీ బీజేపీ. బాబు లేకుండా జనసేనానితో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు కమలనాధులు ప్రిపేర్ అవుతున్నారు. బీజేపీకి బాబు చేసిన అవమానాలు మర్చిపోలేమంటున్నారు పార్టీ నేతలు.

టీడీపీ లేకుండానే ఎన్నికలకు వెళ్లి తేల్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. పవన్‌ను ఒప్పిద్దాం, బీజేపీ అధిష్టానంతో చెప్పి టీడీపీ లేకుండా బరిలోకి దిగుదామన్న వర్షన్ ను బీజేపీ నేతలు హైలెట్ చేస్తున్నారు. అదే సమయంలో బాబుతో కలిసి వెళ్తే ప్రయోజనం ఉంటుందని కొందరు బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా జనసేనాని టీడీపీతో సై అంటుంటే బీజేపీ మాత్రం నై అంటోంది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రయాణం ఎవరితోనన్న ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories