AP News: పల్నాడు జిల్లాలో బీజేపీ-టీడీపీ-జనసేన ప్రజాగళం సభ

AP News: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు తర్వాత తొలి సభ

Shashank Gullapelli
Published on: 17 March 2024 3:52 PM IST
BJP-TDP-Janasena Prajagalam Sabha In Palnadu District
X

AP News: పల్నాడు జిల్లాలో బీజేపీ-టీడీపీ-జనసేన ప్రజాగళం సభ

AP News: పల్నాడు జిల్లాలో బీజేపీ-టీడీపీ-జనసేన ప్రజాగళం సభ జరగనుంది. కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. గన్నవరం నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బొప్పూడికి ప్రధాని బయల్దేరనున్నారు. ప్రజాగళం సభలో పాల్గొని, ఆయన ప్రసంగిస్తారు. పదేళ్ల తర్వాత మోడీ, చంద్రబాబు, పవన్‌ కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు తర్వాత తొలి సభ కావడంతో ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే బొప్పూడికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. కాసేపట్లో బొప్పూడి సభా వేదిక వద్దకు చంద్రబాబు కూడా చేరుకుంటారు. మరోవైపు.. ఏపీ పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. NDA కు ఏపీ ప్రజల ఆశీర్వాదం కావాలని ఆయన కోరారు. ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామన్న మోడీ.. ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తామని భరోసానిస్తూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story