Andhra Pradesh: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh: స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాల్సిన అవసరం లేదు: సుబ్రహ్మణ్యస్వామి

Sandeep Eggoju
Updated on: 10 March 2021 6:20 PM IST
BJP MP Subramanyaswamy Key Comment
X

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: సీఎం జగన్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. కేంద్రం తీసుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుబ్రహ్మణ్యస్వామి. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం అంశం తన దృష్టికి రాలేదన్న ఆయన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్‌పరం చేయడం కరెక్ట్‌ కాదని చెప్పారు. గతంలో ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణను కూడా తాను వ్యతిరేకించినట్టు గుర్తుచేశారు సుబ్రహ్మణ్యస్వామి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story