Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై జీవీఎల్‌ కీలక ప్రకటన..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట‌్‌ను లాభసాటిగా నడిపించాలనేది మా ప్రయత్నం

Shekhar G
Published on: 26 Sept 2023 7:32 PM IST
Bjp Mp Gvl Narasimha Rao Key Statement On Privatization Of Vizag Steel Plant
X

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై జీవీఎల్‌ కీలక ప్రకటన..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పడిప్పుడే జరగదని ఆయన అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశం ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ జీవీఎల్‌ తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట‌్‌ను లాభసాటిగా నడిపించాలనేది మా ప్రయత్నమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ 30 వేల మంది ఉద్యోగులది మాత్రమే కాదు.. ప్రజల ఆస్తి అని జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల్లో ఉందని ఆయన అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story