GVL Narasimha Rao: ఏపీలో వైసీపీ పతనం ప్రారంభం

GVL Narasimha Rao Comments on YCP | AP News Today
x

ఏపీలో వైసీపీ పతనం ప్రారంభం

Highlights

GVL Narasimha Rao: సజ్జల మాటల్లో కనిపిస్తుందని ఎద్దేవా

GVL Narasimha Rao: ఏపీలో వైసీపీ పతనం ప్రారంభమైందనడానికి ప్రజా ఆగ్రహ సభ విజయవంతం కావడమే నిదర్శనమని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. బీజేపీ జాలిగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సజ్జల మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

ఎవరో మాట్లాడిస్తే మాట్లాడాల్సిన దుస్ధితి బీజేపీకి లేదన్నారు. ఏపీపై బీజేపీ ఫోకస్‌ పెడితే వైసీపీ నేతల అడ్రస్‌లు గల్లంతవుతాయని తెలిసే జాలి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ స్వార్థ రాజకీయాలేనని విమర్శించారు. ప్రజలు విసిగి వేసారిపోయారని, వైసీపీ పతనం మొదలైందని జీవీఎల్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories