GVL Narasimha Rao: ఏపీకి ప్రత్యేక హోదా అమల్లో ఉంది

GVL Narasimha Rao: 7,798 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తోంది

Rama Rao
Updated on: 26 July 2022 6:30 PM IST
BJP MP GVL Narasimha Rao Clarified That There is a Apecial Package for AP
X

GVL Narasimha Rao: ఏపీకి ప్రత్యేక హోదా అమల్లో ఉంది

GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ అమల్లో ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ స్పష్టం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 17 EAP ల కోసం 7 వేల 798 కోట్లను ఏపీకి పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రత్యేక హోదాకు బదులే ప్యాకేజీ అమల్లో ఉందని వైసీపీ, టీడీపీ చేస్తున్న ప్రచారాలన్నీ అసత్యాలని జీవీఎల్ కొట్టిపారేశారు. ఈ EAP లపై తీసుకునే రుణం, వడ్డీ రెండు తిరిగి చెల్లించే బాధ్యత కేంద్రానిదే అని తెలిపారు.

ఈ సందర్భంగా రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా చేపట్టామని వందశాతం కేంద్ర నిధులతోనే పనులు జరుగుతున్నాయని సమాధానపత్రంలో పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీని అప్పటి ఏపీ సీఎం అంగీకరించారని లేఖ ద్వారా తిరిగి ధన్యవాదాలు కూడా తెలియజేశారని కూడా కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.

Rama Rao

Rama Rao

Next Story