BJP: 2024లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారు- బీజేపీ నేత‌లు

BJP: టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై బీజేపీ నేత‌లు నిప్పులు చెరిగారు.

Samba Siva Rao
Updated on: 29 May 2021 9:45 PM IST
AP Bjp Fire OnChandra babu
X

 Vishnu Vardhan Reddy (Thehansindia)

BJP: టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై బీజేపీ నేత‌లు నిప్పులు చెరిగారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ రెండ్రోజుల పాటు మహానాడు నిర్వహించింది. చంద్ర‌బాబు మహానాడులో చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు ఎత్తుగడలు ఇక పారవని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఇప్పటికే జనసేన వంటి నమ్మకమైన పార్టీతో భాగస్వామ్యం ఉందని, ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో పోరాడతామని ఉద్ఘాటించారు. అంతకుముందు, సునీల్ దేవధర్ తన ట్వీట్ లో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దివంగత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్టే చంద్రబాబు ప్రధాని మోదీని కూడా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

కానీ, మోదీ సత్తాను తక్కువగా అంచనా వేసి భంగపడ్డాడని సునీల్ దేవధర్ విమర్శించారు. 2024లో బీజేపీతో కలిసి సాగాలన్న చంద్రబాబు మోసపూరిత ప్రణాళిక ఉద్దేశం వెనుక టీడీపీని.. విచ్ఛిన్నం కాకుండా నిలిపి ఉంచే ఉద్దేశం దాగివుందని దేవధర్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ దీన్ని అంగీకరించదని స్పష్టం చేశారు. 2024లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడిపోతున్న విషయం మహానాడు ద్వారా వెల్లడైందని తెలిపారు. అయితే, ఏపీలో సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ నాయకత్వంలోని బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే జగన్, చంద్రబాబులకు చెందిన అవినీతి, కుటుంబ పాలన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతాయని స్పష్టం చేశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story