Andhra Pradesh: జిన్నా టవర్ చుట్టూ రాజకీయాలు.. ఏపీలో కాకరేపుతున్న సత్యకుమార్ ట్వీట్

జిన్నా టవర్ చుట్టూ రాజకీయాలు.. ఏపీలో కాకరేపుతున్న సత్యకుమార్ ట్వీట్
*జిన్నా టవర్‌పై స్పందించిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ *జిన్నా సెంటర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్
Andhra Pradesh: ఏపీ రాజకీయాలు గుంటూరులోని జిన్నా టవర్ చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీ నేత సత్యకుమార్ చేసిన ట్వీట్ కాకరేపుతోంది. గుంటూరులోని టవర్‌కు జిన్నా అని దేశద్రోహి పేరు ఎందుకు పెట్టారని సత్యకుమార్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. పాకిస్థాన్‌లో ఉండాల్సిన జిన్నా టవర్ పేరు గుంటూరులో ఎందుకు ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్పుచేశారని ఆయన గుర్తుచేశారు. ఇక్కడ పేరు మార్చితే తప్పేంటని ఆయన నిలదీశారు.
జిన్నా టవర్‌పై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. భారత దేశాన్ని ముక్కలు చేసిన దేశద్రోహి పేరు గుంటూరు జిల్లాలోని టవర్‌కు ఎందుకని ఆయన నిలదీశారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహానుభావులు ఉన్నారని టవర్‌కు వాళ్ల పేర్లు పెట్టాలని సూచించారు. జిన్నా టవర్‌కు పేరు మార్చకుంటే టవర్‌ను కూల్చేస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.
గుంటూరు జిల్లాలో జిన్నా సెంటర్ పేరును మార్చాలని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు డిమాండ్ చేశారు. దేశ విద్రోహుల పేర్లు మరెక్కడ ఉన్నా తొలగించాలని సోమువీర్రాజు విజ్ఞప్తి చేశారు. ఎందరో భారతీయుల మరణానికి కారణమైన జిన్నా పేరును తొలగించడం దేశానికి అవమానకరమని సోమువీర్రాజు అన్నారు.
విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్‌పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMTజనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMT
ఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMTపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...
23 May 2022 9:23 AM GMT